![]() |
![]() |

మనకు నచ్చిన వాళ్ళను కలిసినప్పుడు వచ్చే ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి. అద్భుతంగా ఉంటుంది కదా. ఇప్పుడు హమీద కూడా అలాంటి స్థితిలోనే ఉంది. హమీద అంటే ఎవరికి తెలీదు చెప్పండి. బ్రహ్మముడిలో కీ రోల్ ప్లే చేస్తోంది. ఇక అమ్మడు బిగ్ బాస్ సీజన్ 5 లో ఫుల్ జోష్ తో ఎంట్రీ ఇచ్చి మంచిగా ఎంటర్టైన్ చేసింది. కలకత్తా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది హమీద. చదువు తర్వాత, తన కుటుంబంతో కలిసి 2013 లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. 2015లో 'సాహసం చేయరా డింభకా' మూవీతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్' మూవీలో నటించింది. నటనతో పాటు, ఆమె ఇంటీరియర్ డిజైనర్ కూడా. అలాంటి హమీద రీసెంట్ గా అర్మాన్ మాలిక్ ని కలిసింది. ఆ ఆనందాన్ని తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది. "అద్భుతమైన పాటలతో అందరినీ అలరించే ఇష్టమైన వ్యక్తిని, సింగర్ ని కలిసినప్పుడు ఒక చిరునవ్వు అలా వచ్చేస్తుంది" అంటూ కాప్షన్ పెట్టి అర్మాన్ మాలిక్ ని టాగ్ చేసింది.

అర్మాన్ మాలిక్ తెలుగులో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ పాడాడు. "బుట్టబొమ్మా" అంటూ అల వైకుంఠపురం మూవీలో పాడిన సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలిసిన విషయమే. ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అశ్వథామ, సీత, మిస్టర్ మజ్ను, అరవింద సమేత, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, తొలిప్రేమ, హలో, మహానుభావుడు, కాటమరాయుడు వంటి మూవీస్ లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. హమీద మాత్రం అటు సీరియల్స్ లో నటిస్తూ ఎప్పుడైనా మూవీ ఛాన్సెస్ వస్తే వాటిల్లో చేస్తూ కొంతవరకు బిజిగానే ఉంది.
![]() |
![]() |